రాష్ట్ర ఎస్సీసెల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్ గా సోమాలమ్మ
మంత్రి సుభాష్ కి కృతజ్ఞతలు
రాష్ట్ర ఎస్సీసెల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్ గా కాజులూరు మండలం గొల్లపాలెం ధనలక్ష్మి పేటకు చెందిన బోమిడి సోమాలమ్మ ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన సోమాలమ్మని రాష్ట్ర స్థాయి పదవికి ఎంపిక చేయడం పట్ల కాజులూరు మండల దళిత సంఘ నాయకులు, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్బంగా సోమాలమ్మ మాట్లాడుతూ టీడీపీ కోసం పడ్డ కష్టాన్ని గుర్తించి తనకు మంచి గుర్తింపు ఇచ్చిన రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తానని పేర్కొన్నారు.