రాష్ట్ర వైసిపి కార్మిక సంఘం విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మండపేట కు చెందిన సీనియర్ వైసిపి నాయకులు శెట్టి నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ఈయన పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీ లో కొనసాగుతున్నారు. మండపేట నియోజక వర్గ ఎలక్ట్రికల్ యూనియన్ వర్కర్స్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.ఈయన కుమార్తె శెట్టి కళ్యాణి కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. ఈ నేపధ్యంలో మండపేట నియోజకవర్గం వైసిపి కార్యాలయంలో వైసిపి పిఏసి సబ్యులు, మండపేట నియోజక వర్గ వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు .వైసీపీ రాష్ట్ర కార్మిక విభాగ కార్యదర్శిగా ఎంపికైన శెట్టి నాగేశ్వరరావును దుశ్శాలువా పూలమాలతో సత్కరించారు.పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఎలక్ట్రికల్ యూనియన్ వర్కర్స్ సత్తింశెట్టి ధనరాజు, కాళ్లసత్తిబాబు, గుండుమరళీ,పిచ్చకుల శ్రీనివాస్ లు పాల్గొన్నారు