పేద ప్రజల మన్ననలు పంపిన మహానాయకుడు వైయస్సార్
గ్రామ సర్పంచ్ ఆరిఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రాయవరం మండలం ,సోమేశ్వరం గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ ఆరిఫ్ ఆధ్వర్యంలో వైయస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, తొలుత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు,కార్యకర్తలకు పంచారు, ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆరిఫ్ మాట్లాడుతూ పేద ప్రజల మన్ననలు పొందిన మహా నాయకుడు వైయస్ రాజశేఖరరెడ్డి అని, పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ,108 వాహనం, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో, పేద ప్రజల ప్రతి ఇంటిని సంక్షేమంతో నింపిన ఘనత వైయస్ రాజశేఖరరెడ్డి కే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వరం గ్రామ సర్పంచ్ శాకా ఆదినారాయణ, ఎంపీటీసీ కాళ్ల అప్పారావు, పిఎసిఎస్ నల్లమిల్లి వీర రాఘవరెడ్డి, మాజీ ఎంపిటిసి తోట వెంకటరావు, వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వినుకోటి ప్రకాష్, గుత్తి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు