Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications
Tuesday, August 5, 2025
🔔 10
Latest Notifications

రాష్ట్రంలో వాహనాలకు గ్రీన్ టాక్స్ తగ్గింపు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం

* ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభకు ఘన పౌర సన్మానం

* వాహన యజమానుల సమస్యను పరిష్కరిస్తా ఎమ్మెల్యే

విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, కాకినాడ

ది కత్తిపూడి మోటర్ లారీ ఓనర్స్ ఆపరేటర్స్ యూనియన్ సభ్యుల జీవనభృతి, లారీ రవాణా వ్యాపార సంబంధ సమస్యలను పరిష్కరిస్తానని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ హామీ ఇచ్చారు. నిజానికి ఈ యూనియన్ కార్యకలాపాలు, వ్యాపారం విషయాలపై నాకు అంతగా పరిజ్ఞానం లేదు. ఐనప్పటికీ తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె మాట ఇచ్చారు.‌ లారీలు వగైరా తదితర వాహనాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణాశాఖ సాలీనా విధించే గ్రీన్ టాక్సును గణనీయంగా తగ్గిస్తామని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్.డి.ఏ. కూటమి పార్టీలు ఇచ్చిన వాగ్దానాన్ని అధికారం చేపట్టాక అమలు చేస్తున్నందుకు వాహన యజమానుల్లో సంతోషం, కృతజ్ఞతలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలోని ది కత్తిపూడి మోటర్ లారీ ఓనర్స్ ఆపరేటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయంలో గ్రీన్ టాక్స్ రద్దు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు పేరుతో సోమవారం కృతజ్ఞతాభినందన సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సత్యప్రభను ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించారు. ఆమెకు పూల దండలను బహుకరించి, శాలువాలను కప్పి ఘన పౌర సన్మానాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చేసిన మేలును వక్తలు గుర్తు చేస్తూ ఆమెను అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. పలు లిఖిత అర్జీలను ఎమ్మెల్యేకు అందించారు. అనంతరం సభికులకు ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. లారీల రవాణా వ్యాపారం జీవన భృతి, జీవనోపాధికి‌ సంబంధించినది కాబట్టి ఈ తరహా కార్యకలాపాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలి. జిల్లాతోపాటు రాష్ట్రం దాటి వెళుతున్నారు. సరకులను వాహనాల్లో రవాణా చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అభివృద్ధిలో మునుముందుకు వెళ్ళాలని సూచించారు. గతంలో ఈ యూనియన్ ఎన్నికల సందర్భంగా కూడా రాజకీయ పార్టీల పట్టింపు లేకుండా ఎన్నికలను నిర్వహించాలని సూచించానని, ఆ విధంగానే ఎన్నికలు సజావుగా జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఎన్.డి.ఏ. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, ప్రకటించిన సూపర్ సిక్స్ పధకాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోందని, ఆ క్రమంలో లోనిదే ఈ గ్రీన్ టాక్స్ ఒకటని అన్నారు. దీని వల్ల వాహన యజమానులుగా మీకు‌ మేలు జరుగుతుందని వ్యక్తం చేస్తున్న సంతోషాన్ని చూసి నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ యూనియన్ ప్రస్తుత కార్యాలయం జాతీయ రహదారుల విస్తరణలోకి పోతోందని, కొత్త కార్యాలయానికి ప్రభుత్వ స్థలం కావాలని కోరిన కోరికను అధికారులతో మాట్లాడి ప్రభుత్వ స్థలం కేటాయింపునకు, వాహనాల పార్కింగు సమస్యను పరిష్కరిస్తా అన్నారు. పార్కింగ్ విషయమై హైవే అధికారులతో గతంలో ఓసారి మాట్లాడి పరిష్కరించాను. మళ్ళీ రెండోసారి కూడా మాట్లాడతా నన్నారు. అలాగే కత్తిపూడి యూనియన్ కు ప్రత్తిపాడు యూనియన్ తో వ్యాపార సంబంధ అంతర్గత సమస్యలపై కూడా ఆ యూనియన్ నాయకులతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మీరు ఏ నమ్మకంతో నాకు ఎమ్మెల్యే బాధ్యతను అప్పగించారో ఆ నమ్మకాన్ని వచ్చే కాలంలో కూడా నిలబెట్టు కుంటానని ఆత్మ విశ్వాసంతో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రకటించారు. జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, సాయి ప్రియా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ కత్తిపూడి లారీ యూనియన్ నూతన భవన నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.‌ యూనియన్ ప్రస్తుత అధ్యక్షుడు గౌతు కన్నారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కృతజ్ఞతాభినందన పౌర సన్మాన సభలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూనియన్ అధ్యక్షుడు దుగ్గన నాగరాజు (బాబ్జి), కాకినాడ జిల్లా లారీ యూనియన్ ఉపాధ్యక్షుడు గౌతు అర్జుబాబు, కత్తిపూడి యూనియన్ మాజీ అధ్యక్షులు గౌతు సుబ్రహ్మణ్యం (నాగు), తెలుగు దేశం పార్టీ శంఖవరం మండల అధ్యక్షుడు బద్ది రామారావు, రాష్ట్ర టి.ఎన్.టి‌.యు.సి. ఉపాధ్యక్షులు వెన్నా ఈశ్వరుడు (శివ), లారీ యజమాని సాధనాల లక్ష్మీబాబు తదితరులు ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గ్రీన్ టాక్స్ ను రూ. 25,000 వరకూ పెంచి తడిపి మోపెడు చేస్తే ప్రస్తుత ఎన్.డి.ఏ. ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానం ప్రకారం దానిని గణనీయంగా తగ్గించి, సుమారు రూ 1,500 – 3,000 మధ్య స్థిరీకరించింది. అంతే తప్ప పూర్తిగా రద్దు చేయలేదు. ఈ వాస్తవాన్ని విస్మరించి కనీస ప్రాథమిక అవగాహన కూడా లేకుండా పూర్తిగా రద్దు చేసినట్టుగా అత్యధికుల ప్రసంగాలు కొనసాగడం ఓ విశేషం. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ (కత్తి పూడి బాబి), జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, విజయవాడ డివిజన్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యడు గొర్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
తెలంగాణ
తూర్పు గోదావరి
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo