పురుషోత్తపట్నం ~ శ్రీరాంనగర్ కాలనీలో ‘ సుపరిపాలనలో తొలిఅడుగు ‘ కార్యక్రమం…!
తెలుగు యువత నాయకులు , ఎటపాక మత్స్య శాఖ ప్రెసిడెంట్ పంతాడి అంజి ఆధ్వర్యంలో
కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని ఎటపాక తెలుగు యువత నాయకులు , మత్స్యశాఖ ప్రెసిడెంట్ పంతాడి అంజి పేర్కొన్నారు. పురుషోత్తపట్నం పంచాయతీలోని శ్రీరామ్ నగర్ కాలనీలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పంతాడి అంజి మాట్లాడుతూ అవిశ్రాంత కార్మికుడు , విజనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏడాదికాలంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న చేసిన సంక్షేమ పథకాలను ఆయన గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు మంచి పాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా అర్హత కలిగిన విద్యార్థులకు 15000 చొప్పున తల్లుల ఖాతాలకు నగదు జమ చేశారని తద్వారా ప్రతి తల్లి ముఖంలో చిరునవ్వులు చూశారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గార్లపాటి శ్రీనివాస్ , దొడ్డపనేని లక్ష్మీనారాయణ , చేకూరి సత్యనారాయణ , శ్రీరాములు , కృష్ణంరాజు , పొదిలి నగేష్ , తదితరులు పాల్గొన్నారు.