Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలి*

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలి

 

వేమగిరిలో బ్యాంకు సేవలపై అవగాహన సదస్సు

 

 

విశ్వం వాయిస్ న్యూస్, కడియం

కడియం మండలం వేమగిరి లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్స్ ఎడ్యుకేషన్,అవేర్నెస్ ఫండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మెగా ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎం ఎ. మహాన మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలని, పి.ఎమ్ జన్ధన్ ఖాతాలు, రూపే ఏటీఎం కార్డు, నామినేషన్ సౌకర్యాలు కలిగి ఉందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ రత్న కుమారి మాట్లాడుతూ జన సురక్ష కార్యక్రమంలో సామాజిక భద్రతా పథకాలైన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి ,ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన,అటల్ పెన్షన్ యోజన,వాటిలో ప్రతి ఒక్కరు నమోదు చేయించుకోవాలన్నారు. సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవాలని, అలాగే బ్యాంకింగ్ ఆప్స్, క్యూ అర్ కోడ్ వాటి పై ప్రత్యేకమైన అవగాహన కలిగి నగదు రహిత లవాదేవీలు నిర్వహణకు, బ్యాంకింగ్ రుణాలు,భీమా పథకాలు,డిపాజిట్ బ్యాంకింగ్ పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలో ఈ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ డి ఓ నవీన్, యూనియన్ బ్యాంక్ రీజనల్ ఎఫ్ ఐ ఆఫీసర్ గోపాల్,వేమగిరి బ్రాంచ్ మేనేజర్ వంశీ, ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల నుండి హరి,అనిల్,చిట్టి తల్లి, జ్యోతి, కడియం ఎపిఎం నాగలక్ష్మి పాల్కొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo