14 October 2025
Tuesday, October 14, 2025

ఎరువులు బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

జగ్గంపేట నియోజకవర్గంలో ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై అన్నదాత పోరుకి శ్రీకారం చుట్టారు. మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తోట నరసింహం ఆదేశాల మేరకు మండల వైసీపీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా గణేష్ రాజా మాట్లాడుతూ, జగ్గంపేటలో రైతులు యూరియా సహా ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కూటమి ప్రభుత్వం విస్మరించినట్లుగా వ్యవహరిస్తోందని అవేదన వ్యక్తం చేశారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం సెప్టెంబర్ 9న నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోట నరసింహం ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు
1. యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులు వెంటనే పంపిణీ చేయాలి.
2. బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలి ఎరువులను పక్క దోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
3. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి .
4. ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరికీ వర్తింప చేయాలి .
5. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుల రాము, రాష్ట్ర ప్రచార విభాగం రామకుర్తి జాగాలు, టౌన్ అధ్యక్షులు కాపవరపు ప్రసాద్, వాణిజ్య విభాగం కరుటూరి వీర్రాజు, ఉపాధ్యక్షులు భూమడ గణపతి రావు, యువజన విభాగం అధ్యక్షుడు నకిరెడ్డి విష్ణు, కార్మిక విభాగం అధ్యక్షురాలు గుర్రం మహాలక్ష్మి (అబ్బు), మండల ప్రధాన కార్యదర్శులు నక్కా శ్రీను, సప్ప రఘు, ఎంపీటీసీలు నంగన నాని, కొండబాబు, చింతా భద్రరావు, అప్పన్న నాగేశ్వర రావు, నకిరెడ్డి ప్రసాద్, బిందనపు పేర్రాజు, గాది కృష్ణ, పలిపిరెడ్డి సత్తిబాబు, సాపిరెడ్డి సత్తిబాబు, పైలా చైతన్య, మల్లువలస శ్రీహరి బాబు, దొడ్డా సూరిబాబు, సావితి కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo