శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ఆమె స్వగృహంలో శ్రీ వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.పూజారి ఆనంద్ మంత్రోచ్చారణ మధ్య అమ్మవారిని పూజించారు. అలంకరించిన పీఠం పై పువ్వులు, దీపాలతో వరలక్ష్మీ అమ్మవారి విగ్రహం ముందు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు తమ కుటుంబ సుఖశాంతులు,ఐశ్వర్యం కోసం చేసే పవిత్ర పూజ అని అన్నారు. పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో అభివృద్ధి కలగాలని అమ్మవారిని ప్రార్ధించారు.వ్రతం అనంతరం మహిళలకు తాంబూలాలు,ప్రసాదం పంపిణీ చేశారు.

