మండపేట మున్సిపల్ గ్రంథాలయం వద్ద రావి చెట్టు సెంటర్లో వెలిసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి సన్నిధి నందు ఆదివారం ఉదయం దేవీ నవరాత్రుల పందిరి రాట ముహూర్తం చేయడం జరిగింది. రానున్న దేవీ నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారి భక్తులు భవానీ దీక్ష స్వీకరించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ విజయదుర్గ అమ్మవారిని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలతో అమ్మవారిని అహర్నిశలు కొలుస్తారు.భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవతగా ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు