నూతన100కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు తో గ్రామంలో లోవోల్జేజీ సమస్య తీరి,విద్యుత్ వినియోగదారులకు ఊరట కలుగుతుందని గ్రామ సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరంలో, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన 100 కేవీ ట్రాన్స్‌పార్మర్ ను గురువారం మండల పరిషత్ అధ్యక్షులు నౌడు వెంకటరమణ,ఎమ్మార్వో ఐపి శెట్టి, టిడిపి సీనియర్ నాయకులు,1వ వార్డు మెంబర్ వుండవిల్లి రాంబాబు తో కలిసి గ్రామ సర్పంచ్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ సందాక శ్రీనివాసులు,లైన్ మాన్ లు శ్రీకాంత్, మురళీకృష్ణ, ట్రాన్స్‌కో సిబ్బంది, మెల్లెం జాన్, కూటమి నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

