మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా మండల కేంద్రమైన రాయవరంలో బుధవారం సాయంత్రం రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు ఆద్వర్యంలో పెద్దఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వాహనదారులకు బ్రీత్ అనలైజర్ తో పరీక్షలు నిర్వహించి, పలువురిపై కేసులు నమోదు చేసారు. కాగా మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమై ఇతరుల ప్రాణాలు తీస్తే వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకూ జైలు శిక్ష, అదనంగా జరిమానా సైతం విధించడం జరుగుతుందని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తున్నా , మందుబాబులు వాటిని పెడచెవిన పెడుతూ స్వయంగా ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం లేక ఇతరుల ప్రాణాలకు హాని కలిగించడం వంటివి నిత్యకృత్యంగా మారాయి. ప్రధాన రహదారిపై వేగంగా, ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ, ఇతరులను భయబ్రాంతులకు గురి చేస్తున్నా, మైనర్ లకు వాహనాలు ఇచ్చే పెద్ద వారిపై సైతం చర్యలు తప్పవని ఎస్సై సురేష్ బాబు హెచ్చరించారు.