పార్టీలకు అతీతంగా కొనసాగుతున్న సంక్షేమం
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. గోకవరం గ్రామంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గోకవరంలో సుమారు 25 మందికి 14 లక్షల 81 వేల 461 రూపాయల చెక్కులను అందజేసిన ఆయన చేతుల మీదుగా అందించారు. జగ్గంపేట నియోజవర్గంలో ఇప్పటివరకు 350 చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.రాష్ట్రంలో ఆరోగ్యపరంగా పరంగాఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమం చేపట్టారని, పార్టీలకతీతంగా అందరిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటున్నారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు మంజూరు, గృహాల మంజూరు , పెన్షన్ల మంజూరు విషయంలో తదితర సంక్షేమ కార్యక్రమాలపై పార్టీలకు అతీతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలు ఇచ్చారన్నారు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుంటే ఓర్వలేని వైసిపి మాత్రం కూటమి పాలనపై బురద జల్లుతుందన్నారు. గతంలో ఇళ్ల స్థలాలు పేరుతో భారీగా దోచుకున్న వైసిపి ప్రజలకు మాత్రం నిలువు నీడని సమకూర్చలేకపోయిందన్నారు. మీ వద్దకు ఏ పార్టీ నాయకుడు గాని , కార్యకర్త గారి వచ్చిన పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అందజేయాలన్నారు. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలోనూ, ఇళ్ల స్థలాలు, ఇండ్ల మంజూరు తదితర అంశాలపై దృష్టి పెట్టి అభివృద్ధి పథకాలను అందరికీ అందే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ,మండల స్థాయి టిడిపి నాయకులు పాల్గొన్నారు.