కార్యకర్తలతో కోలాహలంగా మారిన పార్టీ కార్యాలయం…
మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాష్ట్ర సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా ఎంపిక చేయడం పట్ల మండపేట వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానుల అభినందనలతో ముంచెత్తారు. శాసనసభ కమిటీలలో అత్యంత కీలకమైన సబార్డినేట్ కమిటీ చైర్మన్ గా ఆయన నియామకం జిల్లా ప్రజలకు ఆనందదాయకమని కార్యకర్తలు అభిమానులు పేర్కొన్నారు. రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన ఈయనకు కీలక బాధ్యతల అప్పగించడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తపరిచారు. సాలువాలతో పూలమాలలతో ఆయన్ని కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. వైసిపి పార్టీ కార్యాలయంలోకి ఆదివారం తోట రాగానే రంగు రంగు పుష్పాలు పూల రేఖలతో తనదైన శైలిలో అంజూరు (పూల) శ్రీను పూల వర్షం కురిపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు రాష్ట్రంలో కీలక పదవి వరించడం పట్ల పార్టీ వర్గాలలో నూతన ఉత్తేజం నింపింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మెండు బాపిరాజు, మారిశెట్టి సత్యనారాయణ, యర్రగుంట అయ్యప్ప, పట్టణ మాజీ అధ్యక్షులు ముమ్మిడివరపు బాపిరాజు, జిల్లా ఫుడ్ కమిటీ మాజీ సభ్యులు పేపర్తి సాంబు, సూరంపూడి సత్యప్రసాద్, జిన్నూరు సత్యసాయిబాబా, పెంకే గంగాధరం, ఐ టి వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు, ప్రగడ సూరిబాబు, గంగుమల్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.