Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

సాగి తులసికి సీఎం సహాయనిధి నుంచి రూ.2,03,803 చెక్కు అందజేసిన జ్యోతుల నవీన్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట

అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గండేపల్లి మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన సాగి తులసికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.2,03,803 చెక్కును మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతులమీదుగా అందజేశారు.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, బాధితురాలి పరిస్థితిని గుర్తించి, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సిఫార్సుతో సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం మంజూరైనదన్నారు. ప్రభుత్వ సహాయనిధి పథకం ద్వారా గత సంవత్సరం కాలంలో నియోజకవర్గానికి చెందిన అనేక మంది అవసరమైన చికిత్సల కోసం ఆర్థిక సాయం పొందారని తెలిపారు. దీనికి జ్యోతుల నెహ్రూ కీలక పాత్ర పోషించారని ఆయన ప్రశంసించారు.ఆరోగ్యం దేశ అభివృద్ధికి కీలకమని, పేద కుటుంబాలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం ఆశాజ్యోతిగా నిలవాలని ఆకాంక్షించిన నవీన్, ప్రభుత్వ ఆరోగ్య పథకాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో దేవరపల్లి మూర్తి, మారిశెట్టి రాధా, గండేపల్లి మండల యువత కార్యనిర్వాహక కార్యదర్శి యర్రంశెట్టి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo