సైలెన్సర్ తీసివేసి రోడ్లపై అధిక శబ్దం చేస్తూ ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్న యువకులకు అమలాపురం పట్టణ సీఐ వీరబాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. పేరూరు సెంటర్లో సైలెన్సర్లు తీసి హడావిడి చేసిన యువకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు సైలెన్సర్లు తీసి తిరిగిన యువకులను గుర్తించారు. బైకులను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. మరోసారి చేస్తే కేసులు నమోదు చేస్తామని సిఐ వీరబాబు యువలకులను హెచ్చరించారు.