ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు…
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమం, అభివృద్ధి ప్రతి ఇంటికి చేరాలనేదే లక్ష్యమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మెన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.19, 21 వార్డులలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మండపేట పట్టణంలోని 19, 21వ వార్డులలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి గత ఏడాది కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కరపత్రాలను ప్రజలకు అందించారు. ప్రతీ కుటుంబాన్ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులకు, అధికారులకు సూచించారు. అభివృద్ధిని ప్రతీ ఇంటికి చేరవేయాలనే సంకల్పంతో ఈకార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.