సంఖ్య శాస్త్రం అనేది గణిత శాస్త్రానికి మణిహారం
సంఖ్య శాస్త్రం అనేది గణిత శాస్త్రానికి మణిహారం
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-అంకెలు ఆత్మానందాన్ని, ఉత్సాహమును ఇస్తాయని సౌందర్యా అన్వేషణ,హేతువాదానికి గణితమే అందమని గణిత సేవా సంస్థ రామానుజన్ గణిత అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కే వి వి సత్యనారాయణ అన్నారు. రామానుజన్ గణిత అకాడమీలో సంఖ్యా శాస్త్రంపై జరిగిన సెమినార్ కు అధ్యక్షత వహించారు మరియు ఆయన ప్రసంగిస్తూ గణిత శాస్త్రం మేదో సంబంధమైన కళ అని. అంకెల మధ్య ఉన్న లయ, క్షేత్రగణిత ఆకారాల మధ్య గల శృతి సోయగాలు గణిత వేత్తలకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని అందుచేతనే న నిరంతరము గణిత పరిశోధకలు జరుగుతున్నాయన్నారు. ఆర్యభట్ట నుండి భాస్కరుని వరకు గంగా ప్రవాహంలా సాగిన గణితశాస్త్రం ఆ తర్వాత అనువాదాలు, వ్యాఖ్యానాలు వంటి వాటితో సరిపోయిందని, అటువంటి తరుణంలో రామానుజన్ జననం ఒక గొప్ప ప్రకృతి వై చిత్రి అని డాక్టర్ కే వి వి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్న ఈ గణిత సదస్సులో వరంగల్ కి చెందిన కె సంతోష్ కుమార్, పాలకొల్లుకు చెందిన ఎం. వెంకీ అదే విధంగా అకాడమీ కార్యవర్గ సభ్యులు రేవతి సైన్స్ ఫౌండేషన్ అధ్యక్షులు కే శ్రీకృష్ణ సాయి,ఎం నాగార్జున,పి వై వెంకట్రావు,అడపా సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం విచ్చేసిన సభ్యులందరికీ మెటీరియల్,సర్టిఫికెట్ అకాడమీ తరుపున డాక్టర్ కె.వి.వి సత్యనారాయణ అందజేశారు.