సమాజ ప్రగతికి అవరోధంగా నిలిచిన క్షయ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలి…
గోకవరం మండలం జి కొత్తపల్లి గ్రామములో గురువారం ఇంటెన్సిఫైడ్ టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆదర్శ ఫార్మసీ కాళాశాలలో పి హెచ్ సి వైద్యాధికారణి నిఖిత మాట్లాడుతూ సమాజ ప్రగతికి అవరోధంగా నిలిచిన క్షయ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. టీబీ అంతానికి అందరూ భాగస్వామ్యం అవుదామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఎస్టీఎస్ శ్రీనివాస్, సి హెచ్ ఓ శ్రావ్య లు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఆర్థిక స్థోమత కలిగిన వారు నిక్షయ్ మిత్ర గా చేరి టిబి వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని పోషకాహారం అందించి చేయూత అందించాలని కోరారు. దగ్గు, ఇతర టిబి లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికీ అవగాహన కల్పించి పరీక్షలు చేయించుకోనేవిధంగావిద్యార్థులు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో 108 మందిని పరీక్షించి వారిలో 31 మంది నుంచి కళ్ళే పరీక్షకు సాంపిల్స్ సేకరించారు. అనంతరం అందరూ ప్రతిజ్ఞ చేసారు. ఈకార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ శ్రీను, సి హెచ్ ఓ వినోళ్య, ఏఎన్ఎం నాగలక్ష్మి, ఆశాలు విజయ లక్ష్మి, ఈశ్వరి, సుశీల, అరుణ, నరసింహ లు పాల్గొన్నారు.

