ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండపేట పట్టణ కమిటి ఉపాధ్యక్షులు సన్మాల ధనరాజు ను మారేడుబాక గ్రామం సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు, మండపేట సొసైటీ మాజీ ప్రెసిడెంట్ పెంకే గంగాధర్, నియోజకవర్గం వైసీపీ ఐటి వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు లు పరామర్శించారు. స్థానిక 11వ వార్డులో ఉన్న వారి స్వగృహానికి వెళ్లి ఆయన ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

