జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు జీను మణిబాబు పరామర్శ
కాకినాడ జిల్లా జగ్గంపేట ఆంధ్రప్రభ సీనియర్ విలేకరి, ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు అడపా వెంకట్రావు కొద్దికాలంగా అస్వస్థతకు గురై ఇంటి వద్ద వైద్యం పొందుతున్నారు. టిడిపి సీనియర్ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు అధ్యక్షులు జీను మణిబాబు గురువారం ఆయనను పరామర్శించారు. వెంకట్రావు కాలికి ఇన్ఫెక్షన్ వచ్చి మోకాలి వరకు వాచిపోయింది. స్థానిక ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ ఎంఎస్ బాలగంగాధర్ ఎమ్మెస్ జూలై 26వ తేదీ నుండి వైద్యం అందించారు. సుమారు 45 రోజులుగా ఇంటి వద్ద ఉండి వైద్యం పొందుతున్నారు. విషయం తెలిసిన మణి బాబు స్థానిక నాయకులతో కలిసి వెంకటరావును పరామర్శించారు. త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షులు రాయి సాయి, జగ్గంపేట మాజీ ఉప సర్పంచ్ చెలికాని హరిగోపాల్, మంతెన రవిరాజు, ఆర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.