రోడ్డుపై ఏర్పడిన గుంత వద్ద బారికేడ్లు ఏర్పాటు
– స్పందించిన ఎటపాక ఎస్సై జి.అప్పలరాజు
– ఎస్సైను అభినందించిన స్థానికులు , వాహనదారులు
నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే భద్రాచలం నుండి చర్ల వెళ్లే ప్రధాన అంతర్రాష్ట్ర రహదారిపై ఎటపాక పోలీస్ స్టేషన్ సమీపంలో పెద్ద గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దాంతో మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న ఎటపాక ఎస్సై జి.అప్పలరాజు రాత్రిపూట అయినా కూడా తమ సిబ్బందితో కలిసి రహదారి మధ్యలో ఉన్న గుంతలో కర్రను ఉంచి ఇరువైపులా సిమెంట్ బస్తాలు వేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాంతో ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం లభించిందని , రాత్రిపూట ప్రయాణించే వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా స్పందించిన ఎటపాక ఎస్సై అప్పలరాజును పలువురు అభినందించారు. ఏదిఏమైనా సంబంధిత అధికారులు స్పందించి గుంతను పూడ్చివేయాలని ప్రయాణికులు , వాహనదారులు కోరుతున్నారు.