జగన్ ప్రభుత్వం తెచ్చిన 1214 మోమో ను రద్దు చేయాలి
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేయాలని సెప్టెంబర్ 15న చలో విజయవాడ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఆదివారం కొవ్వూరు స్థానిక సంఘ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మైగాపుల నాగేశ్వరరావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుందర్ బాబు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుకూరి దొరయ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తెచ్చిన 1214 మోమో ను రద్దుచేసి నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయకుండా నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో 35 లక్షల నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని కాపాడడంలో ఆపదలో ఆదుకోవడంలో నిర్మాణ కార్మికుల సంక్షేమచట్టాన్ని అమలు చేసి వారి నిధుల్ని వారికి చట్టబద్ధంగా అందించడంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తుందన్నారు గడిచిన ఆరున్నర సంవత్సరాలుగా చనిపోయిన వికలాంగులైన హాస్పటల్ పాలైన వారందరికీ పథకాలు అందించాలని బోర్డును పున ప్రారంభించాలని జరుగుతున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాణిక్ రెడ్డి రామకృష్ణ మాణిక్ రెడ్డి హరిబాబు జొన్నల రాంబాబు తదితరులు పాల్గొన్నారు