జగ్గంపేటకు చెందిన పేద విద్యార్థి కణితి సోమ శేఖర్ ఇటీవల నిర్వహించిన ఎ యూ సెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంకు సాధించాడు. అతని ప్రతిభను గుర్తించి, శ్రీ కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ తరపున రూ.10,000/- ను విద్యా ప్రోత్సాహకంగా అందజేశారు.ఈ సహాయాన్ని తోట నరసింహం, తోట రాంజీ, ఒమ్మి రఘురాం,ట్రస్ట్ చైర్మన్ కరుటూరి శ్రీనివాస్ చేతుల మీదుగా సోమ శేఖర్‌కు అందజేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, “పేద విద్యార్థుల శిక్షణకు, విద్యాభివృద్ధికి ఎల్లప్పుడూ మా ట్రస్ట్ అండగా ఉంటుంది” అని తెలిపారు.
జగ్గంపేట పేద విద్యార్థికి శ్రీ కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ విద్యా ప్రోత్సాహం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
రచయిత నుండి మరిన్ని
సంబంధిత వార్తలు
