విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, :
వచ్చే ఏప్రిల్ నెలలో మీకు ఏమైనా ముఖ్యమైన బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే ముఖ్య గమనిక. దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు వస్తున్నాయి. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని అన్ని బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉండవు. రాష్ట్రాన్ని బట్టి సెలవులు మారుతుంటాయి. బ్యాంకుకు వెళ్లే ముందు ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది.
బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే సెలవు రోజులకు అనుగుణంగా ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. నిజానికి బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఆన్లైన్ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అన్ని అన్లైన్ లావాదేవీలు 24 గంటలు పని చేస్తాయి. ఏటీఎంలలో కూడా నగదు విత్డ్రా చేసుకునే వీలుంటుంది.