Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అపరిచితులతో పరిచయం వద్దు మండపేట రూరల్ సి ఐ పి శివ గణేష్…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

: సోషల్ మీడియా ద్వారా అపరిచిత వ్యక్తులతో పరిచయాలు మంచిది కాదని మండపేట రూరల్ సీఐ శివ గణేష్ సూచించారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థిని, విద్యార్థులకు , ఎస్ ఐ పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐ శివ గణేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా అపరిచితులను నమ్మి మోసపోవద్దని, వ్యక్తిగత జీవిత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టవద్దని ఆయన విద్యార్థులకు సూచించారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో పోస్ట్ చేసే సమాచారం విషయంలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దిశ మొబైల్ యాప్ ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకుని దిశ యాప్ ప్రయోజనాలు ఏమిటి అది ఏవిధంగా పనిచేస్తోందని పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విపత్కర పరిస్థితుల్లో దిశా యాప్ ఓపెన్ చేసేందుకు తగిన సమయం లేకపోతే ఫోన్ ను గట్టిగా అటూ ఇటూ ఊపుతూ యాప్ ద్వారా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి ఆపద సందేశం చేరుతుందని, వెంటనే పోలీసులు అప్రమత్తమై ఫోన్ కాల్ చేసి వివరాలు సేకరిస్తారని, పోలీసులు ఫోన్ కి ఎవరు స్పందించక పోతే పోలీస్ వెహికల్స్ లో అమర్చిన మొబైల్ డేటా టెర్మినల్ సహాయంతో జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా బాధితులు ఉన్న లొకేషన్ కి పోలీసులు వేగంగా చేరుకునేలా గా ఏర్పాటు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, జూనియర్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement