– బోర్డులపై పేరు మారు అమలు కాని వైనం
– కష్తపడి జిల్లా సాధించుకున్నది ఇందుకా అని సూటి ప్రశ్న
– పేరు మార్చకపోవడం ముమ్మాటికీ అవమానమే
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:ఆగష్టు 2 వ తారీఖు నుండి కోనసీమ జిల్లాను డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం మారుస్తూ జి వో ను విడుదల చేసింది.ఈ జిల్లాను తూర్పు గోదావరి జిల్లా నుండి విభజించారు. రాష్ట్రంలో గత ఏప్రిల్ లో జరిగిన జిల్లాల పునర్విభజన ప్రక్రియలో తూర్పు గోదావరి జిల్లా నుండి కోనసీమ జిల్లాను విభజించగా, అనంతరం జరిగిన అల్లర్లు, ఆందోళనల నేపధ్యంలో ఈ జిల్లాను డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరును మార్పు ప్రభుత్వం చేసింది. ఈ నూతన జిల్లాలో 22 మండలాలు, ఉండగా మొత్తం జనాభా 17.19 లక్షలు. సదరు జీవోలో కొత్త జిల్లాల సరిహద్దులను ప్రస్తావించడం తో పాటు తక్షణం ప్రభుత్వ కార్యాలయాల బోర్డులను మార్చాలని కూడా ఆదేశించింది.
అయితే ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు అవుతున్నాయి. ఇంకా సింహభాగం ప్రభుత్వ కార్యాలయాల బోర్డులలో జిల్లా పేరు మారలేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా పేరు మార్చిన తర్వాత కార్యాలయాల బొర్డులపై పేర్లు మార్చకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ కార్యాలయాల విషయంలో ఇంత నిర్లక్ష్య వైఖరి వుంటే ఇక ప్రైవేటు సంస్థల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా నూతన జిల్లాలో తక్షణం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాల బోర్డులతో పాటు అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును విధిగా వుండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.