జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా…
మండలంలో సచివాలయ సిబ్బంది తో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షా..
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
ప్రతి లేఔట్ లో 90 శాతం గృహ నిర్మాణ పనులు చేపట్టే విధంగా కార్యచరణ ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా గృహ నిర్మాణ సంస్థ, పంచాయతీరాజ్ మరియు గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ కార్యాలయం నుండి మండలానికి సంబంధించి సిబ్బందితో జిల్లా కలెక్టర్ హిమాన్స్ శుక్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ మండల కేంద్రమైన రాయవరం తాసిల్దార్ కార్యాలయంలోబుధవారం రామచంద్రపురం ఆర్డిఓ పీవీ సింధు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా సచివాల సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ రాయవరం మండల పరిధిలోని గృహ నిర్మాణ సంస్థ సిబ్బందితో గృహ నిర్మాణాలు పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామ సచివాలయాలు లేఅవుట్ల వారీగా సమీక్షించారు. ప్రతి లేఔట్ లో 90 శాతం గృహ నిర్మాణ పనులు చేపట్టే విధంగా కార్యాచరణ ప్రణాళికలు అమలు పరచాలని తెలియజేశారు. గృహ నిర్మాణాలకు సంబంధించి సమయం తక్కువగా ఉన్నందున క్షేత్ర స్థాయిలో అధికారులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకుని గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు ఇప్పటికీ ప్రారంభం గృహాల లబ్ధిదారులను ప్రోత్సహించి ప్రతి లబ్ధిదారుడు గృహాన్ని నిర్మించే కొనే విధంగా ముందుగా లేఔట్ లో మౌలిక వసతులు కల్పిoచి సౌకర్యవంతం చేస్తూ ప్రోత్సహించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు గృహ నిర్మాణాలకు ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు పగడ్బందీగా చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్టేజ్ కన్వర్షన్ ద్వారా గృహ నిర్మాణాలను వేగవంతం చేస్తూ పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణాల్లో ఆశించిన పురోగతిని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో లేఔట్లలో ఉత్పన్నమైన సమస్యలపై ఆయన ఆరా తీసి వాటి పరిష్కారానికి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. లేఔట్లలో నిర్మాణ పనులకు సంబంధించి గ్రామ సచివాలయానికి చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కీలకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి డి శివశంకర్, హౌసింగ్ డీఈఈ కొవ్వూరి సత్యనారాయణరెడ్డి,రామచంద్రపురం డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏ శాంతి, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ జి. విజైయ్ కుమార్, రాయవరం ఎంపీడీవో డి తాసిల్దార్ కేజే ప్రకాష్ బాబు, హోసింగ్ ఏఈ కొవ్వూరి శ్రీనివాస్ రెడ్డి, వెలుగు ఇన్చార్జ్ ఏటీఎం నాజర్, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో సుధారాణి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ చైతన్య కుమారి, ఇంచార్జ్ ఈవోపీఎన్ఆర్డి ఏ గోవిందరాజులు, డిప్యూటీ తాసిల్దార్ సుగుణ రేఖ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిరాం, ఆయా గ్రామా సచివాలయ సిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.