విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
ఇవాళ మూడవ కార్తీక సోమవారం శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీకపౌర్ణమి 3వ సోమవారం కావడంతో మండలంలో ఉన్న ఆలయాలకి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని కార్తీక దీపారాధన చేశారు. విశేష సంఖ్యలో భక్తులు వస్తుండటంతో శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కార్తీక సోమవారం పరమశివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో విశేష సంఖ్యలో భక్తులు శివాలయాలను దర్శించుకుని దీపాలనువెలిగించారు. శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మండలంలోని రాయవరం, సోమేశ్వరం, పసలపూడిలలో ప్రసిద్ధి చెందిన శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెదురుపాక, పసలపూడి, చెల్లూరు లో ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో భక్తులు పోటెత్తారు. శివనామస్మరణం తో మార్మోగింది. విశేష పూజలు నిర్వహించారు. కార్తిక నోములు ఉన్నవారు కుటుబం సమేతంగా విచ్చేసి కాలువలో స్నానాలు ఆచరించి ఉపవాస దీక్ష అధిక సంఖ్యలో భక్తులు ఉపవాసాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శశి భక్తులకు ప్రత్యేక పూజలు చేసి దీపారాధన నిర్వహించారు.