విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
గ్రామంలో వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి తక్షణమే వైద్య సేవలు అందించాలని అధికారులను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆదేశించారు
రాయవరం మండలం పసలపూడి పంచాయతీ పరిధిలో నరాలవారిపాలెం లో పారిశుద్యం లోపించి కాలనీకి చెందిన ప్రజలు డెంగ్యు బారీన పడి రాయవరంలో ఐదుగురు, మండపేటలో ఇద్దరు, కాకినాడలో ఇద్దరు పలు ప్రాంతాలలో వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారు. కాలనీలో వెంటనే శానిటేషన్ చేయించాలని రాయవరం ఎంపీడీవో డి శ్రీనివాస్ తోపాటు పసలపూడి పంచాయతీ కార్యదర్శిని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆదేశించారు. అలాగే కాలనీలో ప్రజలు డెంగ్యు బారీన పడటంతో గ్రామంలో వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి తక్షణమే వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శానిటేషన్ కొరకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరారు. అలాగే గ్రామంలో వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి విష జ్వరాలు అదుపులోకి వచ్చే వరకు చర్యలు తీసికోవాలని జిల్లా వైద్య అధికారితో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరలు పాల్గొన్నారు.