విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం గ్రామంలో గత 20 ఏళ్ళుగా అధ్వాహ్న స్థితిలో వుండి, వాహన చోదకులకు, పాదచారులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న రహదారులపై విశ్వంవాయిస్ నరకప్రాయంగా రహదారులు అన్న శీర్షిక కింద 12 అక్టోబరు తారీఖున ఒక ప్రత్యేక కధనం ప్రచురించింది. ఈ వార్తలు తక్షణం స్పందించిన ప్రభుత్వం చాణక్య నర్సింగ్ హోం నుండి మండల కార్యాలయం వరకు సి సి రోడ్, కే వి ఆర్ ఆసుపత్రి నుంచి లొల్ల వంతెన వరకు రోడ్డు మరమత్తులు చేయుటకు మంజురు చేసి తగిన నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. రోడ్ల నిర్మాణం కూడా ప్రారంభం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చెస్తున్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూ, వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో క్రిషి చేస్తున్న విశ్వం వాయిస్ పత్రికకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజెస్తున్నారు.