విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
గ్రామ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో గ్రామ సచివాలయం1 వద్ద సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ ఆధ్వర్యంలో బుదవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాదితులుగా ఎం పి పి నౌడు వెంకటరమణ, అనపర్తి మార్కట్ కమిటి డైరెక్టర్ తేతలి సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ నేపద్యంలో ఎం పి పి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2024లో కూడా ముఖ్యమంత్రిగా చేయడానికి అందరూ కంకణ బద్దులై పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తోలితగా ఎం పి పి వెంకటరమణ, ఎ ఎం సి డైరెక్టర్ సుబ్బిరామిరెడ్డి, సర్పంచ్ రామకృష్ణ లు ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధికంగా ఇంటిపన్ను వసూలు చేసినటువంటి వాలంటీర్లకు గ్రామ పెద్దలు చేతుల మీదగా వెండి గిన్నెలను బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పడాల కమలారెడ్డి, తమలపూడి గంగాధర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది తాడి రామచంద్ర రెడ్డి, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.