జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల చుట్టూ వాలంటీర్లు…
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
వాలంటరీ వ్యవస్థ ద్వారా పింఛన్లు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం వెలమ కమ్యూనిటీ హాలులో సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ అధ్యక్షతన నూతనంగా మంజూరైన పింఛన్లను మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శుక్రవారం పంపిణీ చేశారు. రాయవరం మండలానికి సంబంధించిన కొత్త పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత టిడిపి హయాంలో టిడిపి నాయకులు కార్యకర్తలు జన్మభూమి కమిటీలు చుట్టూ పేద ప్రజలు ప్రదక్షిణలు చేసేవారని, దయాదాక్షిన్యాలపై పింఛన్లు ఇచ్చేవారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల చుట్టూ వాలంటీర్లు తిరుగుతున్నారని, జగన్ ప్రభుత్వంలో అర్హులకే అందలం ఎక్కిస్తున్నారని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి న్యాయం చేసేలా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. కొన్ని కారణాలతో పెన్షన్ల నిలిపివేతకు నోటీసులు ఇస్తే ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గగ్గోలు పెట్టారని ఇప్పుడు ఒక్క పెన్షన్ కూడా రద్దు చేయకుండా అదనంగా పెన్షన్లను కొత్తవారికి అందజేస్తున్నామని తెలిపారు. ఈనియోజకవర్గానికి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఏం అభివృద్ధి చేశాడని వ్యంగ్యంగా అన్నారు. ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉండాలన్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి పని చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్న కొందరు మాత్రమే ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని, నిజమైన పేదలు తిరిగి జగన్ రావాలని కొరుకుంటున్నారని స్పష్టం చేశారు. మండలానికి సంబంధించిన 371 పింఛన్లు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా నూతనంగా రేషన్ కార్డు లేనివారికి రేషన్ కార్డు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేతుల మీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి, రాయవరం ఎం పి డి వో డి శ్రీనివాస్, తాసిల్దార్ కేజే ప్రకాష్ బాబు, ప్రభుత్వ విప్ కర్రీ విజేత, మండల సర్పంచ్ అధ్యక్షులు షేక్ అరీఫ్, వైస్ ఎంపీపీ కొవ్వూరి అమ్మిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి, రాయవరం మండల పార్టీ అధ్యక్షులు చిన్నం అపర్ణ పుల్లేష్, రాయవరం ఎంపీటీసీ 2 గంటి రోజా, కో ఆప్షన్ సభ్యులు సుధాకర్, వార్డ్ మెంబర్ తాడి రామచంద్రారెడ్డి, గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు మంతెన అచ్యుతరామరాజు, తమలంపూడి గంగాధర రెడ్డి, కొల్లు రాంబాబు, పడాల కమలారెడ్డి, వెంకటేశ్వర స్వామి ఆలయ దేవస్థానం చైర్మన్ పులగం శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, గ్రామ సచివాలయ కార్యదర్శులు, సచివాలయ కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.