న్యూరో,ఎముకల సమస్య చికిత్స కోసం రోబోటిక్ పరికరాలు అందుబాటులోకి
ఆర్‌ఓఎన్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో హోం మంత్రి తానేటి వనిత
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం,:
- ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలందించాలని హోం శాఖ మంత్రి తానేటి వనిత సూచించారు.స్థానిక నందం గనిరాజు జంక్షన్‌లో ఫిజియోధెరపిస్ట్‌లు డాక్టర్ టి వినీత, డాక్టర్ కె అనీల్ సాధర్యంతో ఏర్పాటు చేసిన రోబోటిక్ ఆర్థోన్యూరో(ఆర్‌ఓఎన్) రిహేబిలిటేషన్ ఆసుపత్రిని మంత్రి తానేటి వనిత ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించారు.ఆర్ధో న్యూరోలో రోబోటిక్ పని చేసే విధానాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రోబో ద్వారా వైద్య సేవలందించే విధానాన్ని రాజమండ్రిలోనే కాకుండా జిల్లాలోనే మొదటి సారిగా ఇక్కడ ప్రవేశపెట్టిన వైద్యులు వినీత, అనీల్‌ను అభినందించారు. కొత్త ఆలోచనలకు పునాదులు వేయడం అభినందనీయమన్నారు. ప్రస్తుత ఈ ఆధునిక ప్రపంచంలో వాతావరణం కలుషితమవుతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నా రని, దానిలో న్యూరో సమస్యలు కూడా ఉన్నాయన్నారు. ఒక వయస్సు వచ్చిన తరువాత ప్రతి ఒక్కరికీ న్యూరో,ఎముకల సమస్యలు రావడం సర్వసాధారణమన్నారు. అయితే వాటి చికిత్స కోసం రోబోటిక్ పరికరాలు అందుబాటులోకి రావడం సంతోషమన్నారు. ఆసుపత్రి నిర్వాహకులు వినీత, అనీల్ మాట్లాడుతూ తమ రోబోటిక్ పరికరాల ద్వారా ఆర్ధో, న్యూరో పేషంటర్లకు వైద్య సేవలందించే విధానాన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో మొదటిగా ప్రవేశపెట్టింది తామేనన్నారు. తమ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ, ఆక్యూఫంక్ఛంర్ థెరపీ, పోస్టు స్ట్రోక్ కేర్, పోస్టు హోపిటేలేషన్ కేర్,యూరినల్ బ్లేడెర్ స్టీమూలేషన్,విర్ట్యువల్ రియాలిటీ రిహేబిలిటేషన్ వైద్య సేవలందిస్తామని వివరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, రుడా ఛైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్, దాసి వెంకటరావు,అశోక్ కుమార్ జైన్,మరుకుర్తి రవి యాదవ్,హరి బెనర్జీ,వైద్యులు వినయ్ భూషణం,విజయ్ భూషణం తదితరులు పాల్గొన్నారు.