విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
బైకులతో మైనర్ల హల్ చల్ అనే శీర్షిక కింద విశ్వంవాయిస్ లో ఫిబ్రవరి 3 వ తేదీన ప్రచురితమైన వార్తకు అనూహ్య స్పందన లభించింది. రాయవరం పోలీసులు స్పందించి బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపితే వాహనచోదకులతో పాటు వారికి వాహనాలు ఇచ్చినందుకు తల్లిదండ్రులకు శిక్ష పడే అవకాశం ఉందని, మైనర్ బాలబాలికలు బైకులు, ఇతర వాహనాలను నడిపితే ఉపేక్షించేది లేదని, ఆయా వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని రాయవరం ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు స్కూటీలు. బైకులు ఇవ్వడం మానుకోవాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 18ఏళ్లలోపు బాల బాలికలంతా బైకులు, స్కూటీల రైడింగ్‌కు దూరంగా ఉండాలని, ప్రమాదాల నివారణ లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. 18 ఏళ్లు దాటిన యువతీ, యువకులంతా తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సును పొందాలని, వాహనాలు నడిపే సమయంలో రికార్డులు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.