WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

కాకినాడ రూరల్ లో మల్టిలేవల్ మార్కెటింగ్ మాయాజాలం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మల్టీ ట్రేడ్ ప్రైవేటు కంపెనీల పేరుతో యువతను టార్గెట్

డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ సెంటర్

పేరుతో కోట్లాది రూపాయలు గడిస్తున్నా వైనం

దర్యాప్తు చేసి నిందితులపై కేసు నమోదు చేస్తాం

సర్పవరం సిఐ మురళీకృష్ణ

విశ్వంవాయిస్ న్యూస్, కాకినాడ రూరల్:

నిరుద్యోగ యువతీ యువకులను ఆసరా చేసుకుని డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ సెంటర్ పేరుతో కోట్లాది రూపాయలు గడిస్తున్నా వైనం వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగులారా ఎటువంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నారా అయితే మీకు మంచి అవకాశాలు కల్పించేందుకు మేము సిద్ధం,రండి మాదగ్గర మీకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం.నెలకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు వరుకు సంపాదించి,అనతికాలంలోనే కోటీశ్వర్లు కావచ్చు పలు సామాజిక మాధ్యమాలలో ప్రకటనలు చాలా మంది చూసే
ఉంటారు. ఇలాంటి ప్రకటనలు చూసిన నిరుద్యోగ యువత తమను తాము నిరూపించుకోవాలని అప్పులు చేసి పెట్టుబడి పెడతారు. చివరకు తాము మోసపోయామని గ్రహిస్తారు. కాకినాడ రూరల్ లో మల్టిలేవల్ మార్కెటింగ్ మాయాజాలం వారు
గ్రహించేసమయానికి తామే చాలా మంది బాధితులను తయారు చేస్తారు. ఈ మోసపూరితమైన వ్యాపారం నగరం నడిబొడ్డున నేడు కొంతమంది దర్జాగా చేస్తూ నిరుద్యోగ అమాయకులను మోసం
చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సరిగ్గా ఇలాంటి వ్యాపారమే కాకినాడ జిల్లా కేంద్రంగా ఒక్క సంవత్సరం ఆరునెలలగా 5వేలమంది యువతి, యువకులతో పెట్టుబడి
పెట్టించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బయటకు ఆన్లైన్ బట్టల వ్యాపారం పేరు చేసేది మల్టిలేవల్ మార్కెటింగ్, (గొలుసుకట్టు)వాస్తవానికి మార్కెటింగ్ ఈలాంటి మల్టిలేవల్ లెవల్ వ్యాపారాలు ప్రపంచలో చాలా దేశాలు రద్దు చేసాయి. భారతదేశంలో ఇలాంటి మనీ సర్క్యులేషన్ పద్దతి గొలుసుకట్టు వ్యాపారాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
ఇండియా నిషేధం ఉంది. అయితే ఈలాంటి ఘరాన మోస వ్యాపారులు మాత్రం చట్టం పరిధిలోకి రాకుండా, బిజినెస్ ప్రమోషన్, డిస్టిబ్యూటర్స్ అంటూ పలు పేర్లు మార్చి యధేచ్చగా దొంగ వ్యాపారాలు సాగిస్తున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో మల్టీ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో గత రెండు సంవత్సరాలుగా ఈవ్యాపారాన్ని ప్రారంభించారు. దీన్ని పలు సామాజిక మాధ్యమాలలో ప్రకటనల ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు, ఆకర్షించారు. ఈ ఒక్క కేంద్రంలో ఇప్పటివరకు సూమారు 5వేల మందికి పైగా పెట్టుబడులు పెట్టారనే సమాచారం. తొలుత ఒక యువతి లేక యువకుడు ఈ కేంద్రానికి వస్తారు.. వారికి బిజినెస్ స్టాటప్ అంటూ వారితో రూ.10000 వరకూ కట్టించుకుంటారు. దానికి రెండు లేక మూడు వేలు విలువ చేసే దుస్తులు, లేక సౌందర్య సంరక్షణ క్రీములు ఇస్తారు. అనంతరం మూడు రోజుల పాటు యువతి, యువకులను ఎలా మోటివేషన్ చేస్తూ మీరు ముందుగా రూ.46 వేలు కట్టి, మరో నలుగురును జాయిన్ చేయడం జరుగుతుంది. ఇక మీరు మా వ్యాపారంలో భాగస్వామ్యులయ్యారని, మీరు ఇతరులను, మన వ్యాపారంలో చేర్చటం ద్వారా కమీషన్ రూపంలో నగదు వస్తుందని నమ్మబలుకుతారు. ఒక వ్యక్తి తన క్రింద ఇద్దరూ లేక నలుగురిని చేర్చుకోవటం ద్వారా ఆదాయం పొందవచ్చునని వారికి మోటివేషన్ (బ్రెయిన్ వాష్) చేస్తారు. అలా మొదలై ఒకరు పదుల నుంచి వందలమంది చేర్చుతారు. ఇలా తాము ఈ వ్యాపారంలో పెట్టబడి పెట్టి తద్వారా ఇతరులను చేర్చటం ద్వారా ప్రతీ ఒక్కరు దగ్గర నుండి సంస్థ కమీషన్ ఇస్తుందని, తొలిగా చేరిన వారు ఇంకా చాలామంది చేర్చుతారు. అసలు దుస్తులు, లేక యాక్సిసిరిస్ కమీషన్ సంస్థ ఎలా ఇస్తుంది. ఈ సంస్థలో చేరిన వారికి వారు కట్టిన సొమ్ముకు ఎదొక వస్తువు ఇస్తారు. అవి బట్టలు, లేక మరేదైనా వస్తువు కావచ్చు, కానీ కమీషన్ ఎందుకు ఇస్తున్నారంటే కట్టిన సొమ్ముకు, తీసుకున్న వస్తువులకు ధరల విషయంలో పొంతనే ఉండదు. కాకినాడ కేంద్రంగా కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో మల్టీ ట్రేడ్ ప్రైవేటు
లిమిటెడ్ పేరుతో సాగుతున్న ఈ వ్యాపార సంస్థలో తొలుత ఒక వ్యక్తి వద్ద బిజినెస్ ప్రారంభం అంటూ రూ 46 వేలు వరకు కట్టించుకుంటారు. కట్టించుకున్న సొమ్ముకు కేవలం రెండు, లేక మూడు వేలు విలువ చేసే బట్టలు ఇస్తారు, కానీ లేక ఇతర వస్తువులు ఇస్తారు. ఒక వ్యక్తి వద్ద కట్టించుకున్న సొమ్ముకు కనీసం పొంతన విలువ లేని వస్తువులు ఇచ్చి ఈ వ్యక్తిని రీపర్ చేసిన వారికి కమీషన్ ఇస్తారు… క్రిందకు వెళ్ళే కొలదీ కష్టాలే… అయితే ఈ వ్యాపారంలో ఎంతమంది జాయిన్ చేస్తే అంతసొమ్ము సంపాదించవచ్చు. కానీ క్రింద తాము ఇక ఇతరులను జాయిన్ చేయకపోతే వారి
వ్యాపారం ఆగిపోతుంది. వారికి భారీనష్టం వస్తుంది. మల్టీ ట్రేడ్ ప్రైవేటు కంపెనీల పేరుతో చదువుకుంటున్న యువతను టార్గెట్గా చేసుకుని కోట్లాది కోట్లకు టోకరా వేసేందుకు ప్రణాళికలు
సిద్ధం చేసుకుంటున్నారని కొంతమంది యువతి, యువకులు గగ్గులు పెడుతున్నారు. మా ద్వారా వ్యాపారం చేసుకుంటూ మేము జాయిన్ చేసిన వారి దగ్గర నుండి రూ 46000 తీసుకుని
వారికి 38 వేలకే రసీదులు ఇవ్వడం జరుగుతుందని ఆరోపణలు చేస్తున్నారు. మోటివేషన్ క్లాసుల్లో మీరు కట్టిన సొమ్ముతోపాటు లక్షాధికారి అయిపోవచ్చని మీకు తెలియకుండానే మీ కింద చైన్
లింక్ ద్వారా అనేకమంది జాయిన్ అవ్వడం జరుగుతుందని వారందరూ వద్దనుండి కమిషన్ రూపంలో సొమ్ములు వస్తాయని చెప్పడం జరుగుతుందన్నారు. కానీ రూ.46వేలు కట్టి
నలుగురును జాయిన్ చేసిన తర్వాత పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాడు కాకినాడ రూరల్ మండలంలోని వాకలపూడి గ్రామంలో మల్టీ ట్రేడ్ ప్రైవేటు
లిమిటెడ్ కంపెనీ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై యువతి యువకులు మాట్లాడుతూ చదువు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మాకు మా స్నేహితుల ద్వారా మల్టీ ట్రేడ్
ప్రైవేట్ లిమిటెడ్ లో జాయిన్ చేయడం జరిగిందన్నారు. మా వద్ద నుండి సుమారు రూ.46000 కట్టించుకోవడం జరిగిందన్నారు. సుమారు మా దగ్గర నుండి 500 మంది వరకు జాయిన్
చేసుకోవడం జరిగిందని, 500 మంది నుండి ఒక్కొక్కరు చొప్పున రూ.46000 వసూళ్లు చేయడం జరిగిందన్నారు. మాకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు పోలీస్ శాఖ అధికారులకు
ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. మల్టీ లెవల్ మార్కెట్ మాయాజాలంతో మోస పోయిన బాధితులు సర్పవరం సిఐ మురళీకృష్ణ ను కలిసి తమ గోడు వెల్లబుచ్చారు. అయితే జేసి ఇప్పటికే ఈ వ్యాపారాలపై దర్యాప్తు చేయమన్నారనీ, బాధితులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి నిందితులపై కేసు నమోదు చేస్తామని సిఐ తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement