విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
కాలిన గడ్డి వాములో గుర్తుతెలియని మృతదేహం లభ్యం సంఘటనపై పోలీసులు ఎస్సై పి.వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ హత్య కేసు నమోదు చేసి సీఐ పి.శివ గణేష్ అద్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సోమేశ్వరం గ్రామ శివారుణ చిన్న తలుపులమ్మ లోవ (చిన లోవ) సమీపంలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి చేనును గోవిందు కౌలుకు తీసుకుని యున్నాడు. గోవిందు శుక్రవారం ఉదయం తన పొలం దగ్గరకు వచ్చేసరికి పొలం గట్టు పైన ఉన్న గడ్డివాము తగలబడడం గమనించి వెళ్లి చూసేసరికి గడ్డి వాములో ఒక శవం పూర్తిగా కాలిపోవడం గమనించి వెంటనే రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశారని, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చూసేసరికి శవం పూర్తిగా కాలిపోవడం ప్రక్కన మహిళకు సంబంధించిన చెప్పులు, గాజు పెంకులు గుర్తించి కాకినాడ నుండి డాగ్ స్క్వార్డును రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారని, ఈ చెప్పులు, గాజు పెంకులను ఆధారంగా చూస్తుంటే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక వ్యక్తిని హత్య చేసి సోమేశ్వరం శివారు తలుపులమ్మ లోవ వద్ద గోవిందు చేను వద్ద వున్నాదిమ్మపై గడ్డివాములో ఉంచి తగలబెట్టి ఉంటారని, కౌలు రైతు గోవిందు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో గోవిందు పొలం చూడడానికి వచ్చేసరికి గడ్డివాము తగలబడి దాంట్లో ఒక శవం గుర్తుపట్టలేని విధంగా పూర్తికే కాలిపోవడం ఉండడాని గమనించి రైతు పోలీసులు ఫిర్యాదు చేశాడని ఆయన పేర్కొన్నారు. దీనిపై రామచంద్రపురం డి.ఎస్.పి డి. బాలచంద్ర రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. హత్య చేయబడినది పురుషుడా, యువతి లేక వివాహిత కోణంలో దర్యాప్తులో తెలియాల్సి ఉందని సీఐ గణేష్ తెలిపారు. ఈ హత్య చేయబడిన ఎవరు అనేది తెలియాలంటే ఆయా పోలీస్ స్టేషన్లలో అదృశ్యంపై కేసు నమోదైన వారి వివరాలను సేకరించి, ఈ ఆధారాలను ఆధారంగా ఎవరైనా గుర్తించిన్నట్లయితే రాయవరం పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, దీనిపై కౌలు రైతు గోవిందు ఇచిన పిర్యాదు మేరకు ఎస్సై సురేష్ హత్య కేసు నమోదు చేసి సిఐ శివ గణేష్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.