WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

మానభంగం చేసి… గొంతు నులిమి హత్య చేశారు …

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మహిళను చంపిన కేసులో ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు….

మీడియా సమావేశంలో హత్య కేసు వివరాలు వెల్లడించన డిఎస్పీ డి.బాలచంద్రా రెడ్డి…

కేసు చిక్కుముడి చేదించేందుకు ముఖ్యా పాత్ర వహించిన సిబ్బందికి అభినందనలు తెలియజేసిన ఎస్పిసుధీర్ కుమార్ రెడ్డి, డిఎస్పి బాలచంద్రా రెడ్డి

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

  1. మండలంలో మాచవరం – సోమేశ్వరం చిన లోవ శివారు ఫిబ్రవరి 24వ తేదీ ఉదయాన్నే గడ్డివాములో తగలబెట్టిన ఓ మహిళ మృతదేహానికి సంబంధించి నిందితులను అదుపులోనికి తీసుకుని రాయవరం పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రామచంద్రపురం డిఎస్పి బాలచంద్రారెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఎస్పి విలేకరలతో మాట్లాడుతూ సంఘటన జరిగిన నాటినుండి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రామచంద్రపురం డి ఎస్పి డి.బాలచంద్రా రెడ్డి పర్యవేక్షణ లో మండపేట రూరల్ సీఐ పి.శివ గణేష్ ఆధ్వర్యంలో రాయవరం పోలీస్ స్టేషన్ ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ మూడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం జల్లెడ పట్టారని, సంఘటనా స్థలంలో దొరికిన చెప్పులు, సర్వీసులు వైర్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తూ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కనిపించకుండా పోయారా అన్న కోణంలో దర్యాప్తు చేశారని ఆయన అన్నారు. అనంతరం మాచవరం గ్రామానికి చెందిన ద్వారంపూడి గంగరాజు కుమార్తె కొవ్వూరు సత్యవేణి ఫిబ్రవరి 23వ తారీకున సత్యవేణి కుమారుడైన చెవిటి మూగ తో భాదపడుచున్న అబ్బాయి తన తల్లి రాత్రి ఇంటికి రాలేదు అని చెప్పడం, సత్యవేణి మానసీక పరిస్తితి సరిగా లేకపోవడం తో ఎక్కడికి వెళ్ళినా రెండు మూడు రోజులలో తిరిగి ఇంటికి వచ్చే ఆమె ఈ సారి ఐదు రోజులు అయినా రాకపోవడం తో తన కుమార్తె సత్యవేణి మొన్న గడ్డి మేటు లో కాల్చి చంపి ఉంటారు అని అనుమానం తెలియపర్చినారు. సత్యవేణి ఎక్కడికి వెళ్ళినా ప్రతి నెల 1 వ తారీఖున వితంతు ఫించన్ తీసుకోడానికి వచ్చేస్తాదని అనుకున్నారన్నారు. కాని ఆ రోజు ఆమె రాక పోవడం తో హత్య గాబడినది సత్యవేణిగా నిర్ధారణ కావడం జరిగిందని అయన అన్నారు. దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించగా అదే గ్రామానికి చెందిన నల్లమిల్లి ఉమామహేశ్వర రెడ్డి, అతని తమ్ముడు వెంకట సత్యనారాయణ రెడ్డిలు సంఘటన జరిగిన రోజు నుండి కనిపించకపోవడం, గత రెండు సంవత్సరాలుగా క్రితం వితంతువైన మృతురాలని వారి ఇరువురు వేధిస్తున్న సందర్భంలో గ్రామ పెద్దలు పిలిచి మందలించారన్న విషయాన్ని తెలుసుకున్నారు. పరారీలో ఉన్న వీరు ఇరువురిని చెల్లూరు బ్రిడ్జి వద్ద చింత సుబ్బారాయుడు చారిటబుల్ ట్రస్ట్ కళ్యాణ మండపం ఎదురుగా పుంత రోడ్డు వద్ద ఉన్నట్లు గా పోలీసులకు సమాచారం రాగ వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. అనంతరం వారిని విచారించగా తమను గ్రామ పెద్దలు మందలించడంతో సత్యవాణి పై కోపం పెంచుకున్నామని పిబ్రవరి 23 వతేదీ రాత్రి ఆమె ఇంటికి వెళ్ళడం గమనించి మేము గడ్డి మేటు వద్ద కాచుకొని ఆమె నోరు నొక్కి ఆమెను మానభంగం చేసి, గొంతు నులిమి చంపేశామని, ఆమె మెడలో ఉన్న బంగారు వస్తువులు తీసుకుని ఎవరూ లేని సమయం చూసి గడ్డిమేట్లో శవాన్ని కాల్చివేసినట్లుగా ఉమామహేశ్వరరెడ్డి, సత్యనారాయణరెడ్డి లు అంగీకరించారన్నారు. ఈ కేసు చిక్కుముడి తీసేందుకు ముఖ్యా పాత్ర వహించిన సిఐ పి శివ గణేష్, స్సై పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్, రాయవరం కానిస్టేబుల్ లు బి వి వి సత్యనారయణ, పలివెల రాజు, అంగర కానిస్టేబుల్ సిహెచ్ యేసు కుమార్, పోలీస్ సిబ్బంది లను జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, రామచంద్రపురం డి ఎస్పి డి.బాలచంద్రా రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పి. వెంకటేశ్వరరావు, ఆయా గ్రామాల సచివాలయ మహిళ పోలీసులు తదితరులు ఉన్నారు.
advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement