విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
రాయవరం శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నులుపురుగు మాత్రలు ఎంపీడీవో డి శ్రీనివాస్ విద్యార్థులకు వేశారు. మండలంలో జాతీయ నులుపురుగు నివారణ దినోత్సవం ను పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలో ఆల్బ్ండజోల్ మాత్రలు వేశారు. పీహెచ్సీ వైద్యాధికారిణి అంగర దేవి రాజశ్రీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఏ శాంతి, ఎంపీడీవో డి శ్రీనివాస్ , సిడిపిఓ వరాహ లక్ష్మి పాల్గొని , పిల్లలకు నులి పురుగు నివారణ మందులు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల కడుపులో నులిపురుగు ఉండడంవల్ల రక్తహీనత, శారీరక ,మానసిక ఎదుగుదలాగిపోవడం తదితర దుష్పరిణామాలు ఉత్పన్నమవుతాయన్నారు. పిల్లల్లో చురుకుదనం తగ్గోపోతుందన్నారు. పరిశుభ్ర వాతావరణంలో ఉండడం ,పరిశుభ్రమైన, వెచ్చని ఆహారం తీసుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లోనూ, శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పప్పు శ్రీనివాస రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ డి కృష్ణ శేఖర్, హెల్త్ విజిటర్ విజయలక్ష్మి, ఏఎన్ఎం సూర్య కళ, ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత ,వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కాగా రాయవరం పీహెచ్సీ పరిధిలో 4621 మందికి మందు పంపిణీ చేయాల్సి ఉండగా 4459 చిన్నారులకు నులిపురుగు నివారణ మందు వేసినట్లు డాక్టర్ రాజశ్రీ తెలిపారు. మిగిలిన వారికి ఈనెల 18న మందు అందజేసినట్లు తెలిపారు.