లే అవుటులలో మౌలిక వసతులు కల్పించాలి…
గృహాలు నిర్మించుకునే అన్ని విధాలుగా లబ్ధిదారులను ప్రోత్సహించాలి…
జగనన్న కాలనీలు ప్రారంభోత్సవానికి సుస్వాగత ముఖ ద్వారాలు ఏర్పాటు చేయాలి…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా…
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగన న్న లేఔట్లలో గృహాలు త్వరితగతిన నిర్మించి పేదవాడు నాది అని గర్వంగా చెప్పుకునే స్వర్గసీమ సొంతిoటి కలను సాకారం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని సోమేశ్వరం గ్రామంలో జగనన్న లేఅవుట్లలో ఆయన పర్యటించి లబ్ధిదారులైన గృహణిలతో ఇళ్ల నిర్మాణాల పురోగతి స్థితుగతులను గూర్చి ఆరా తీశారు. గృహాలు నిర్మించు కోవడంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసు కున్నారు. లేఔట్లకు సంబంధించి అప్రోచ్ రోడ్లు, అంతర్గత రహదారులు లేఔట్లలో కనీసవసతులైన త్రాగునీరు విద్యుత్తు డ్రైనేజీలు వంటి సమస్యల పైన మెటీరియల్ సరఫరా పైన ఆరా తీశారు. అనంతరం మండల కేంద్రమైన రాయవరం గ్రామ సచివాలయం 2, వైయస్సార్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలను పరిశీలించారు. ఖరీఫ్ ఈ క్రాప్ నమోదు ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు సచివా లయం సిబ్బందితో యాదృచ్ఛికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేఔట్లలో కొంతమంది మాత్రమే గృహాల నిర్మించుకున్నారని మిగిలిన వారు కూడా గృహాలు నిర్మించుకునే విధంగా అన్ని విధాలుగా ప్రోత్సహించి కాలనీలు ప్రారంభోత్సవానికి సుస్వాగత ముఖ ద్వారాలు నిర్మించి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు అత్యంత నాణ్యత ప్రమాణాలతో నిర్మించి ప్రజలకు ఆ యొక్క వసతులు ప్రజలకు అందు బాటులోనికి తేవాలని ఆదేశిం చారు. ఈక్రాప్ బుకింగ్ పారద ర్శకంగా చేపట్టి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా రైతాంగానికి మేలు చేకూర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి పి సింధు సుబ్రహ్మణ్యం, మండల ప్రత్యేక అధికారి డి ఆర్ డి ఏ. పి డి, వి. శివ శంకర్ ప్రసాద్ జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి బాబురావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఏ బోసు బాబు, ఎంపీడీవో కె నరేంద్ర, డిప్యూటీ తాసిల్దార్ విజయ రేఖ, హౌసింగ్ ఏఈ కె శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ అధికారి కె ప్రభాకర్, ఏపీఓ సుధారాణి వెలుగు ఏపిఎం నజీర్, ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ చైతన్య కుమారి, సర్పంచ్ షేక్ ఆరిఫ్, పంచాయతీరాజ్ డిఇ రామనారాయణ, తదితరులు పాల్గొన్నారు.