Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

విజేతలుగా నిలిచిన కృష్ణ, గుంటూరు క్రీడాకారులు..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

క్రీడాకారులలో విజేతలుగా నిలిచిన కృష్ణ గుంటూరు. మండల కేంద్రమైన రాయవరం శ్రీరామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న 67వ ఎసీఎఫ్ అంతర్ జిల్లా అండర్-17 బాస్కెట్బాల్ పోటీలు ఆదివారం సాయంత్రంతో ముగిసాయి. బాలుర విభాగంలో ఫైనల్ పోటీలు కృష్ణా, వెర్సెస్ పశ్చిమగోదావరి జిల్లా జట్లు తలపడగా కృష్ణా జిల్లా విన్నర్గా, పశ్చిమగోదావరి జిల్లా జట్టు రన్నర్స్ నిలిచాయి. బాలికల విభాగంలో గుంటూరు వెర్సెస్ కృష్ణా జట్లు తలపడగా, గుంటూరు జట్టు విన్నర్స్ గా, కృష్ణా జట్టు రన్నర్స్ గా నిలిచింది. తృతీయ స్థానం కోసం బాలుర విభాగంలో తూర్పుగోదావరి వెర్సెస్ నెల్లూరు జట్లు పోటీ పడగా తూర్పుగోదావరి విజయం సాధించింది. అలాగే బాలికల విభాగంలో తూర్పుగోదావరి వెర్సెస్ పశ్చిమగోదావరి జిల్లా జట్లు తలపడగా పశ్చిమగోదావరి జట్టు విజయం సాధించి, తృతీయ స్థానంలో నిలిచింది. పోటీల అనంతరం విన్నర్స్, రన్నర్స్ జట్లకు పాఠశాల హెచ్ఎం వీఎస్ సునీత ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్త, విద్యాదాత చింతా పాండురంగారెడ్డి, ప్రముఖ వైద్యులు జిఎస్ఎన్ రెడ్డి ల చేతుల
మీదుగా ట్రోఫీలు, మెడల్స్ అందజేసారు. బాలుర ఫైనల్ మ్యాచ్కు భీమేష్, త్రినాధవర్మ, శ్రీనివాసరావులు, బాలికల ఫైనల్ మ్యాచ్కు సునీతాకుమారి, భీమేష్, అజీమ్లు అంఫైర్లుగా వ్యవహరించారు. అండర్-17 విభాగంలో విజేతలుగా నిలిచిన బాలురు, బాలికల జట్లు జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ బాస్కెట్బాల్ పోటీలకు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. అండర్-17 బాలుర జట్టు మహారాష్ట్రలో, బాలికల జట్టు రాజస్థాన్ రాష్ట్రంలో త్వరలో జరిగే
జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నాయి. ఈ పోటీలకు రాష్ట్ర పరిశీలకుడిగా కృష్ణారెడ్డి వ్యవహరించగా, ఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్లమిల్లి అప్పారెడ్డిలు గేమ్స్ ను పర్యవేక్షించారు. విన్నర్స్, రన్నర్స్కు ట్రోఫీల ప్రధానంలో సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, మండపేట ఏఎంసీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు, జెడ్పీటీసీ నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ ఛైర్మన్ తేతల సుబ్బరామారెడ్డి,ఏ ఎమ్ ఓ పిల్లి రాంబాబు, ఎంఈవో వై.సూర్యనారాయణ,యోగా గురువు వెలగల ఫణికృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నేత మంతెన అచ్యుతరామరాజు, పడాల కమలారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement