మండపేట నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
ఘనంగా వైఎస్ఆర్సిపి మండల కార్యాలయం ప్రారంభోత్సవం…
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్ద పీట వేసిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మండపేట నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో బుదవారం వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు తమలంపూడి గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న రాయవరం వైఎస్ఆర్సిపి మండల కార్యాలయం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లిన ధైర్యంగా మనం ఓటు అడిగే హక్కు ఒక వైసీపీ పార్టీకే ఉందని తోట అన్నారు. గత ప్రభుత్వంలో పేదవాడికి ఏ సహాయం కావాలన్నా జన్మభూమి కమిటీ చుట్టూ నాయకులు చుట్టూ తిరగాల్సి వచ్చేది అన్నారు. మన వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. మండల స్థాయిలో ప్రజలకు ఏ ఇబ్బందులు ఎదురైనా ఈ కార్యాలయంలో పరిష్కరించే విధంగా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగినదని రాయవరం మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వైసిపి పార్టీ అందించిన సంక్షేమ పథకాలు ఏ పార్టీ అందించిన దాఖలాలు లేవన్నారు. ప్రతి పేదవారు వైసిపి ప్రభుత్వ పాలనలో సంతోషంగా ఉన్నారన్నారు. ఎక్కడికి వెళ్లినా వైసిపి పార్టీకి ప్రజలు భ్రమరథం చేపడుతున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ తోట మండల అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి కి పూలమాల వేసి అభినందిస్తూ ఈ మండల వైసిపి పార్టీ కార్యాలయాన్ని కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా నడపాలని, మండలంలో అన్ని గ్రామల్లలో వున్నా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులో వుండాలని అయన సూచించారు. ఈ కార్యక్రమంలో కేపీఆర్ సంస్థలు డైరెక్టర్ కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి (సత్తిబాబు), మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు, జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి ( చినకాపు), ఎంపీపీ నౌడువెంకటరమణ, రాయవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ తేతల సుబ్బరామారెడ్డి, డాక్టర్ టి . నవీన్, సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ, ఉప సర్పంచ్ బొడ్డు శ్రీను , వెలగల సత్యనారాయణ రెడ్డి, బొడ్డు శీను, వార్డ్ మెంబర్లు కొల్లి అన్నపూర్ణ ఆనంద్, మందపల్లి మనమ్మా కొండల రావు, లంక చందు, పోతంశెట్టి సాయి మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు మంతెన అచ్యుత రామరాజు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పులగం శ్రీనివాసరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు పి.సుధాకర్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు అరిఫ్, జే సి ఎస్ కన్వీనర్ జగన్, మండల బూత్ కమిటీ కన్వీనర్ చింత సుబ్బారెడ్డి, వైసిపి నాయకులు కొల్లు రాంబాబు, లాలం సూరిబాబు, అడ్డూరి సూరిబాబు, కోట బాబురావు, చింతా సుబ్బారెడ్డి, పోతంశెట్టి సత్తిబాబు, వాసంశెట్టి రాధాకృష్ణ మండలంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వైసిపి నాయకులు గృహ సారధులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.