విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం రూరల్ ,విశ్వం వాయిస్ న్యూస్:
అద్దె భవనంలో నిర్వహిస్తున్న అమ్మ వికలాంగుల, అనాధల ఆశ్రమ సొసైటీ కి రూ 30 లక్షల వ్యయంతో తమ తండ్రి గారైన నాళం జగ్గారావు,తల్లి చంద్రమతి పేరు మీదుగా నూతన భవనం నిర్మించి భవనానికి సంబంధించిన తాళాలను ఆశ్రమ నిర్వాహకుడు చిట్టిబాబుకు అందజేసి నాళం వారి కుటుంబం సభ్యులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. రాజమహేంద్రవరం రూరల్ నామవరం,డి బ్లాక్, చాపల మార్కెట్ సమీపంలో గత 8 సంవత్సరాల కాలంగా అమ్మ అంధ, వికలాంగుల అనాధల ఆశ్రమ సొసైటీని ప్రెసిడెంట్ చిట్టి బాబు,వైస్ ప్రెసిడెంట్ నాగలక్ష్మి, సెక్రెటరీ దుర్గాప్రసాద్ లు అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు.40 మంది వికలాంగులు ఉండే ఈ ఆశ్రమం ను ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నిర్వహణ కొనసాగిస్తున్నారు. అనాధ శరణాలయం నిర్వహణ భారంగా మారిందని తెలుసుకున్న నాళం వారి కుటుంబ సభ్యులు నాళం మధుసూదన్,రాఘవరావు,భాస్కర రావు, జగన్మోహన్ రావు లు తమ దాతృత్వంతో 30 లక్షల విలువ గల భవనాన్ని నూతనంగా నిర్మించి అనాధ శరణాలయానికి మంగళవారం అప్పగించారు. ఈ సందర్భంగా అనాధ వికలాంగుల శరణాలయం నిర్వాహకుడు చిట్టిబాబు మాట్లాడుతూ అమ్మ అంధ, వికలాంగుల అనాధల ఆశ్రమ సొసైటీని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వాహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి నెల అద్దె పదివేల రూపాయలు చెల్లించడంతోపాటు మందుల భోజన నివాస వసతి భారంగా మారిందని అన్నారు. రేకుల షెడ్డులో అనాధ శరణాల నిర్వహించడం వలన వర్షాకాలంలో వర్షం నీరు గదుల్లోకి చేరి వికలాంగులు ఇబ్బంది పడే వారిని తెలిపారు.ఈ విషయాన్ని బాదం లక్ష్మి కుమార్ ( జై బాబా) ద్వారా తెలుసుకున్న నాళం కుటుంబ సభ్యులు సహృదయంతో 30 లక్షల వ్యయంతో స్థలం కొని ఆ స్థలంలో నూతన భవనం నిర్మించారని ఆనందం వ్యక్తం చేశారు. 40 మంది వికలాంగులకు భవనం నిర్మించి ఇవ్వడం ద్వారా నాళం కుటుంబ సభ్యులు తమ మంచితనాన్ని దాతృత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు.
ఈ సందర్భంగా అనాధ శరణాలయం భవనం దాతలు నాళం వెంకట సుబ్రహ్మణ్యం, నాళం మధుసూదన రావు, రవీంద్ర, రాఘవరావు, భాస్కరరావు, జగన్మోహన్ రావు తదితరులు మాట్లాడుతూ తమ తండ్రిగారు నాళం జగ్గారావు, చంద్రమతి పేరు మీదుగా రూ 30 లక్షల వ్యయంతో అనాధ శరణాలయం నిర్మించి ఇవ్వడం జరిగిందని అన్నారు. అనాధ శరణాలయం నిర్వహణ భారంగా మారింది తెలుసుకున్నతాము తమ సొంత ఖర్చులతో నూతన భవనం నిర్మించామని పేర్కొన్నారు,ఈ భవనం వికలాంగులకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు చిట్టిబాబు మాట్లాడుతూ నాలం వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.40 మంది వికలాంగులకు ఈ నూతన భవనం నిర్మించి ఇవ్వడం ద్వారా వారికి ఆశ్రమం కల్పించారు కొనియాడారు. జీవితాంతం వారికి రుణపడి ఉంటామని అన్నారు.