విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
మండపేట,విశ్వం వాయిస్ న్యూస్:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, గ్రామీణ వైద్యులు పెదపాటి విష్ణుకు సామాజిక సేవారంగంలో ఈనెల 29న గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారు. హైదరాబాద్ కింగ్ కోటి తిలక్ రోడ్డు బొగ్గులకుంట లోని తెలంగాణ సరస్వతీ పరిషత్ ఆడిటోరియంలో ఆసియా వేదిక్ అంతర్జాతీయ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ స్ఫూర్తి అకాడమీ స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ పీస్ ఆఫ్ ఇండియా ఎన్జీవో స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవో ఆసియా వేదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో విష్ణుకు గౌరవ డాక్టరేట్ అవార్డును అందిస్తున్నట్లు ఆసియా వేదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ అకాడమీ స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.గత 10 సంవత్సరాలుగా పలు సంస్థలలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఎన్జీవో సంస్థను స్థాపించి తన వంతుగా సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ, సామాజిక సేవే తన జీవిత ఆశయం సమాజ సేవ కోసం నిత్యం ఎన్నో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అనే ఒక మంచి ఆశయంతో అనేక సేవలు అందిస్తున్నారు రక్తదానం అంటే ప్రాణదానమని నలుగురికి తెలియజేస్తూ అనేకమంది యువతలో చైతన్యం కలిగిస్తూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్త దానం చేస్తూ ఎందరో ప్రాణాలను కాపాడుతూ రక్తదాతగా ప్రాణదాతగా ఆపదలో ఆపద్బాంధవుడుగా నిలిచారు… ఒక పక్క సమాజంలో జరిగే అన్యాయాలు నిలదీస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తూ గ్రామీణ వైద్యులుగా సేవలందిస్తూ అవసరమైన చోట ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు వికలాంగు ఆశ్రమాలలో రోడ్ సైడ్ బి క్షాటకులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం చలికాలంలో నిరుపేద వృద్ధులకు దుప్పట్లో పంచిపెట్టడం మండు వేసవిలో చలివేంద్ర కార్యక్రమాలు నిర్వహించడం కరోనా కష్ట కాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది అనాధలకు ఆకలి తీర్చే ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అనేకమందికి ఆరోగ్య రిత్య అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఆకలితోవున్న పేద ప్రజలకు బియ్యము నిత్యవసర సరుకులు ఏర్పాటు చేశారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పలు రంగాల్లో రాణిస్తున్నందుకు విష్ణుకు గౌరవ డాక్టరేట్ అవార్డును ఇస్తున్నట్లు ఆకుల రమేష్ తెలిపారు.డాక్టరేట్ అవార్డుకు సంబంధించిన కన్ఫర్మేషన్ పత్రాన్ని ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ,స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో కార్యాలయంలో సంస్థ నిర్వాహకులు అకుల రమేష్ ప్రధాన కార్యదర్శి ఇమ్మిడిశెట్టి రవీందర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి గ్రామీణ వైద్యులు పెదపాటి విష్ణుకు గౌరవ డాక్టరేట్ అవార్డు ఎంపికైనందుకు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలపారు.