చిన్న చిన్న పొట్లాల రూపంలో తిరుపతి నగరంలో గంజాయిని విక్రయిస్తున్న ముద్దాయిలు.
తిరుపతి పట్టణం, జీవకోన లో మాటువేసి ముద్దాయిలను పట్టుకున్న అలిపిరి పోలీసులు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు కేసు వివరాలు వెల్లడించిన అలిపిరి సీఐ రామ కిషోర్.
విశ్వంవాయిస్ న్యూస్, తిరుపతి
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు తిరుపతి పట్టణం L & O అదనపు ఎస్పీ రవి మనోహర ఆచారి గారి మరియు తిరుపతి డిఎస్పి వెంకట నారాయణ గారి పర్యవేక్షణలో, అలిపిరి సీఐ రామ కిషోర్ మరియు తన సిబ్బందితో 20-09-2024 వ తేదీ ఉదయం 08-00 AM గంటల సమయంలో తిరుపతి, జీవకోన లో మాటువేసి ఐదు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిల వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్లను శోధన చేయగా, చిన్న చిన్న పోట్లాల రూపంలోA1. ముద్దాయి వద్ద మాత్రం 700 గ్రాములు, మిగతా వారి వద్ద 500 గ్రాముల చొప్పున, మొత్తం 2.7 కేజిల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు వీటిని తిరుపతి పట్టణం నందు కావలసిన వారికి అమ్మేవారని తెలిసింది. ముద్దాయిలు వద్దకు గంజాయి వస్తున్న మార్గాలపై, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారి గురించి కేసు దర్యాప్తు చేస్తున్నాము, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని అలిపిరి సిఐ రామ కిషోర్ తెలిపారు. ఈ కేసు ఛేదనలో, ముద్దాయిలను అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన అలిపిరి సీఐ రామ కిశోర్ మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., గారు అభినందించారు.