విశ్వంవాయిస్ న్యూస్, రాజానగరం
కోండగుంటూరు గ్రామానికి చెందిన మణి అన్న బ్లడ్ ఆర్మీ సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పెంటగట్ల మణికుమార్ కు 430కి పైగా పురస్కారాలు,2 డాక్టరేట్లు వచ్చిన సందర్భంగా రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ , తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ బోడ్డు వెంకటరమణ చౌదరి, బిజేపి ఇంఛార్జి నీరుకోండ వీరన్న చౌదరి చేతులు మీదగా డాక్టర్ పెంటగట్ల మణికుమార్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ భవిష్యత్తులో మరెన్నో సేవ కార్యక్రమాలు చేయాలని మరెన్నో పురస్కారాలు అందుకోవాలని,డాక్టర్ పెంటగట్ల మణికుమార్ లాంటి వ్యక్తి నా నియోజకవర్గం లో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తునని అని అన్నారు.ఈ కార్యక్రమంలో పెంటగట్ల రాజి బాబు, తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి కోత్తపల్లి రఘు,కోల్లం రత్నం పెమ్మనబోయిన వెంకటేష్,అరిగెల రామకృష్ణ,జగతా భద్రరావు పెమ్మనబోయిన కోటి రామకృష్ణ,పెంటగట్ల మణికంఠ, పెంటగట్ల అజాయ్, పల్లేటి వెంకట్రావు,కోండగుంటూరు గ్రామ ప్రజలు, వివిధ శాఖల మండల ,గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.