విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం
భారత్ దేశం గర్వించదగ్గ పారిశ్రామిక దిగ్గజం రతన్ నోవెల్ టాటాకు ఘన శ్రదంజలి
టాటా మరణం రవాణా కార్మికులుకు తీరని లోటు
రామచంద్రపురం లారి యూనియన్ అసోసియేషన్
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-భారత్ దేశ రవాణా ప్రరిశ్రామిక దిగ్గజం,టాటా గ్రూప్ సంస్థల అధిపతి నోవెల్ టాటా మృతికి రామచంద్రపురం లారి ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గన్నమని చక్రవర్తి ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు సంతాపం తెలియజేస్తూ ఘన శ్రద్ధాంజలి గటించారు.ఈ సందర్బంగా లారి యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రవర్తి మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ రంగం పితామహుడు,ప్రముఖ ఇండస్ట్రీ లిస్ట్,దేశంలో పకృతి వైపరీత్యా ఆపద కాలంలో ఆదుకునే గొప్ప మనసున్న ధానశిలి, ఎంతోమంది నిరుద్యోగులు పాలిట పేదల దైవసంభూతుడు నోవెల్ రతన్ టాటా మరణం దేశానికీ మరియు కార్మికులుకు తీరని లోటని అన్నారు.అలానే రతన్ టాటా జీవితం ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సమాజానికి అయన చేసిన సేవలను దేశంలో వున్నా దిగ్గజ పారిశ్రామిక వ్యక్తులుతో పాటు,చిన్న చిన్న సంస్థల అధినేతలు రేపటి భారత్ దేశ అభిహృద్ధికి ఉపయోగ పడే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలానే రతన్ టాటా ఎంతోమంది నిరుద్యోగులు కు ఉపాధి కల్పించే విధానం అందరూ అవాలంభించుకోవాలని కోరారు.
రతన్ టాటా జీవిత చరిత్రను చక్రవర్తి వివరిస్తూ అయన డిసెంబర్ 28న బొంబాయిలో జన్మించారని,1991-2012 టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా పనిచేశారన్నారు.అలానే న్యూయార్క్‌లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్‌లో పట్టభద్రుడయ్యారని,టాటా గ్రూప్‌కు సారథ్యం వహించిన తర్వాత దానిని విస్తరించేందుకు రతన్ టాటా చురుకుగా తన ప్రయత్నాలు ఫలించే విధంగా ప్రయత్నిం చేశారని తెలిపారు.టాటా తన వ్యాపారాలను గ్లోబలైజ్ చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టడంతో పాటు 2000లో లండన్‌కు చెందిన డెడ్లీ టీని 431.3 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారని ఈ సందర్బంగా వివరించారు.
దేశ చరిత్రలో ఏ పారిశ్రామిక వ్యక్తి చేయలేని సాహసం రతన్ టాటా ఆలోచనలో మధ్యతరగతి ప్రజలకు కారు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రతన్ టాటా నానో కారును తీసుకొచ్చారు.పేదవాడు కూడా కారులో తిరిగే రోజు రావాలని,పేదవాడుకి కూడా కార్ లో తిరగలానే కలలు ఉంటాయని సాటి మనిషిగా ఆలోచన విధానాన్ని మాటలలో వర్ణించాలేమని చక్రవర్తి అన్నారు.అందుకే పేదవాడికి అందుబాటులో ఉండేలా దీని ధర సుమారు లక్ష రూపాయలు ఉండేలా ఏర్పాటుకి కృషి చేశారు.తదనంతరం 2012లో టాటా గ్రూప్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసి,టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించిన తరువాత,అక్టోబర్ 2016 నుండి తాత్కాలిక ఛైర్మన్‌గా కూడా కొంతకాలం పనిచేయడం జరిగిందని,2017 జనవరిలో నటరాజన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమితులైనప్పుడు రతన్ టాటా పదవీ విరమణ అయిందన్నారు.