విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం
బెంగళూరు అలిమ్కో ఆధ్వర్యంలో దివ్యాంగులకు స్క్రీనింగ్ క్యాంపు
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం మండలం ఎంఈఓ ఆఫీసు నందు సోమవారం మరియు మంగళవారం రోజుల్లో దివ్యాంగులకు 0 నుండి 18 సంవత్సరం వయసులో గల దివ్యాంగులకు ఉపకారణాలు అందించుట కొరకు బెంగళూరు అలిమ్కో వారు స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించడం జరిగింది. గత మార్చ్ 2024 లో మెడికల్ క్యాంపు అటెండ్ అయ్యి దరఖాస్తు చేసుకున్న వారి పిల్లల యొక్క అప్లికేషను జిల్లా అంతా కలిసి రామచంద్రపురం నందు అప్లికేషన్లో స్క్రీనింగ్ చేయడం జరిగింది. అర్హులైన వారికి 2024-25 అకాడమిక్ సంవత్సరంలో వారికి అవసరమైనటువంటి ఉపకరణాలు అలింకో సంస్థ బెంగళూరు వారి ద్వారా అందిస్తామని, అలిమ్స్ కోసం ప్రతినిధులు తెలియజేశారు.మొత్తం జిల్లా అంతా కలిసి 368 అప్లికేషన్స్ ను స్క్రీనింగ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ,ఎ ఎం ఓ రాంబాబు,మరియు జిల్లాలో అన్ని మండలాల ఐ ఈ ఆర్టీలు, రామచంద్రపురం మండలం విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.