విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
పీఎంపీ లకు అత్యవసర వైద్యం పై అవగాహన
గ్రామీణ ప్రాంతాల్లో ప్రాధమికంగా వైద్య సేవలందించే పీఎంపీలు అత్యవసర సమయంలో చేయు ప్రాధమిక వైద్యం పై అవగాహన కల్గి ఉండాలని ప్రముఖ వైద్య నిపుణులు పిల్లాడి పరమహంస అన్నారు.శనివారం కమ్యూనిటీ పారామెడిక్స్&ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ది పీఎంపీ అసోసియేషన్) దేవరపల్లి మండలం ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు,నూతన కార్యవర్గ ఎన్నిక జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.ఈ సదస్సులో రాజమండ్రి కి చెందిన గంగా ఎమర్జన్సీ హాస్పిటల్ సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ పిల్లాడ పరమహంస మాట్లాడుతూ పీఎంపీ లు అత్యవసర పరిస్థితుల్లో చేయు ప్రధమ చికిత్స గురించి తెలిపారు.గైనకాలజిస్ట్ డాక్టర్ స్పందన మాట్లాడుతూ మహిళలు ఇబ్బంది పడే గర్భకోశ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు.దేవరపల్లి మండల నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు,జిల్లా కార్యదర్శి పి దేవానందం ల సమక్షంలో నూతన అధ్యక్షులుగా ఆకుల నాగేశ్వరరావు, నూతన కార్యదర్శిగా దాసరి సత్య భాస్కర్, నూతన కోశాధికారిగా సీహెచ్ ప్రసాద్ రాజు,ఉపాధ్యక్షులుగా మామిడి వెంకటరావు, సహాయ కార్యదర్శిగా బాల బ్రహ్మానందరావు,గౌరవ అధ్యక్షులుగా సీహెచ్ కమరాజులతో పాటు ఏడుగురు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది.తొలుత ప్రపంచ పాత్రికేయ దినోత్సవం ను పురస్కరించుకుని స్ధానిక పాత్రికేయులను ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గంగా ఎమర్జెన్సీ హాస్పిటల్ మేనేజర్ రుక్మాంగదరావు మండల సభ్యులు పాల్గొన్నారు.అనంతరం వైద్యనిపుణులను సభ్యులు ఘనంగా సత్కరించారు.