– యూనివర్సల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఆరుమిల్లి రాజేంద్రబాబు
విశ్వంవాయిస్ న్యూస్, Rajamahendravaram
రాజమహేంద్రవరం,విశ్వంవాయిస్ న్యూస్: రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ‘నీ ప్లస్’ అగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతను తమ హాస్పిటల్స్ లో అందుబాటులోకి తెచ్చినట్లు యూనివర్సల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఆరుమిల్లి రాజేంద్రబాబు చెప్పారు. ఇప్పటికే అత్యంత అనుభజ్ఞులైన వైద్య నిపుణులు, అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. డాక్టర్ ఆరుమిల్లి కృష్ణ ఫణింద్ర ప్రసాద్, డాక్టర్ ప్రశాంతి కోనేరు, డాక్టర్ స్ఫూర్తి కొల్లూరి లతో కల్సి గురువారం ఉదయం దానవాయిపేట లోని యూనివర్సల్ హాస్పిటల్స్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేంద్రబాబు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లా ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలనే లక్ష్యంతో, పనిచేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఏర్పాటుచేసిన నీ ప్లస్ ద్వారా మోకాలు మార్పిడి చికిత్సలను అత్యంత కచ్చితత్వంతో సులువుగా చేయవచ్చని, ఈ విధానంలో అతి తక్కువ కోతతో సర్జరీ చేయడం వల్ల పేషెంట్ త్వరగా కోలుకోగలుగుతారని ఆయన చెప్పారు. దీనివలన ఏ విధమైన రక్తస్రావం ఉండదని ఆపరేషన్ చేసిన 3వ రోజే పేషేంట్ ని డిశ్చార్జ్ చేస్తామని, పేషేంట్ కూడా సులువుగా నడవ వచ్చని తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన వారందరికీ ఈ చికిత్సలు అందచేయా లన్న లక్ష్యంతో తమ హాస్పిటల్ కార్యాలయంలో ఈనెల 24వ తేదీ అదివారం ఉచిత మెగా శిబిరం నిర్వహిస్తున్నట్లు డా రెజేంద్రబాబు చెప్పారు. ఈ మెగా శిబిరంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న మొదటి 100 మందికి సర్జరీలపై రాయితీ సౌకర్యం ఇస్తామన్నారు. హెల్ప్ లైన్ : 90325 27999 అలాగే 08832555533/44 లో సంప్రదించాలని ఆయన సూచించారు.