విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
తెలుగు ప్రజలు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది ఉగాది. ఉగాది నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది.
నేడు కొత్త పనులు ప్రారంభించడం పరిపాటి చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది పండుగను జరుపుకుంటారు.
యుగానికి ఆది యుగాది అది కాస్త వాడుక భాషలో ఉగాదిగా మారింది అని పెద్దలు చెప్తారు.
నేటి తోనే వసంత రుతువు కోకిల గానం తో మొదలవుతుంది.
నేడు పంచాంగ శ్రవణం చదవటం జరుగుతుంది. ఉగాది రోజు అమ్మ అరు రుచుతో కూడిన పచ్చడిని చేస్తుంది.
దాని అర్థం ఏమిటంటే జీవితంలో సుఖసంతోషాలు, కష్టనష్టాలను సమానంగా స్వీకరించాలని అర్థం.
తీపి: సంతోషానికి
చేదు: బాధకి
కారం: కోపానికి
ఉప్పు: భయానికి
పులుపు: చిరాకు కి
వగరు: ఆశ్చర్యానికి
గర్తులుగా భావిస్తారు.
ఈ ఆరు రుచుల యొక్క సమ్మేళనం ఉగాది.
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు శ్రీ శుభకృత్ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు .